సంగీతం – కవిత

వీచే గాలి, ఎగిసే పైరు..,

కురిసే వాన, మెరిసే మెరుపు …,

ఆలపించిన ఆరాట ప్రవాహం.

సంగీతం…,

చల్లనినీరు సాగే సంద్రపు జోరు ….,

ప్రకృతి సెలయేరు, సంగీతపు తీరు…,

అంతమెరుగని విజ్ఞానారంభ పోరు …

పలికే మాటలు పాడిన పాట.

చక్కని కోయిల కూసిన కూత.

ఓటమి తెలియని ఓరిమి ఆట.

సన్నని గొంతుల మధురపు పూత. సుస్వర సుమధుర సరిగమ కళాపం.

సంగీతం…

కిలకిలమనే పక్షి నేర్పిన తీయని రాగం.

పెళపెళమనే ఉరుము కలిసే శృతి శబ్దం

తళుకు తళుకుమను తార చూపిన తాళం.

గలగల పలుకుల భాష చెప్పిన గానం.

శృతి గతుల సప్తపదుల సమాధానం.

సంగీతం…

దేవుడు మెచ్చిన వరం అందమైన ఆశాగళం.

ఆశా జ్యోతుల కాంతి కిరణం.

సిరి మువ్వల సరి సవ్వడి త్వరణం.

సనిదప మగరిస సుశ్యామల ఆలాపం

సంగీతం…

2 thoughts on “సంగీతం – కవిత”

Comments are closed.