స్మార్ట్ ఫోన్లు – కవిత

చిట్టి చిలకలారా

చిట్టి చిట్టి చేతులతో

కట్టాలి గుజ్జన గూళ్ళు

ఆడాలి బొమ్మలతో ఆటలు

నేడు మీ చిట్టి చేతుల్లో

స్మార్ట్ ఫోన్లు వీడియో గేమ్స్

వాటితోనే ఆటలు పాటలు

ఇది డిజిటల్ యుగం

ఏమై పోతున్నది బాల్యం

స్మార్ట్ ఫోన్లకు బలి