స్నేహం – కవిత

Author
G.Srinivasulu

Last Updated on

ఉద్వేగాలూ, ఉద్యోగాలూ

సద్యోగం లేని సాయంత్రాలూ

కబుర్లతో కరిగి పోయే కల్తీ లేని మస్తీలు

గమ్యం కోసం గజినీ లా అవస్థలు

సినిమాలూ, షికార్లు

వయసు మిన్నంటే వలపుల తలపులు

బ్రతుకు యాత్రలో ఎన్నో మజిలీలు

మంచి-చెడుల ఉచ్చ్వాస నిశ్వాసాలు

ఎవరికీ తెలియని అపరిమితాలు

మనకు మాత్రమే తెలిసిన మహా రహస్యాలు

సలహాలు, సమీకరణాలు, సహాయాలు, సన్నద్ధాలు

ప్రతి కార్యాలు, ప్రతీకారాలు, జయాలు, పరాజయాలు

అన్నింట్లో నా వెంటుండి వెనుతట్టిన నా నేస్తాలూ,

స్నేహానికి మీరే నిర్వచనాలు ……

Leave a Reply