Software Koluvu | Writing

‘software’ కొలువు

నిశీధి దుప్పటి గప్పిన గదిలో
విదేశీ గుప్పిట చిక్కిన బతుకులు
నిరాశ ఒక్కటి నక్కిన మదిలో
నిషాల కోరలు చాచిన రేయిలు

అప్పుల చిట్టకు అక్షర సాక్ష్యమె 
మార్చిన లక్షల ఖాగజ్ చెక్కులు
తిప్పలు తప్పవు ముందర తద్యమె
మార్చర ముందీ ఘాడీ సోకులు

ఇవే ఇవే మా సాఫ్ట్వేర్ కొలువులు
వెతికిన దొరకవు బతుకున విలువలు
ఇవే ఇవే మా ఐటీ హంగులు
ఇక్కడ దొరుకును హైటెక్ మొంకులు

రచన : –
కలం పేరు : కోపిష్టి
మరిన్ని రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి