అంతంలేని భావాలు

ఊహించలేని అర్థాలు
కనురెప్పకాలంలో కలలు
ఇవన్నీ తెలుగుభాష లీలలు
పదాలని కలిపే ఓనమాలు
పాదాలని కలిపే పద్యాలు
ఎన్నెన్నో సాహిత్యపురాతత్వ ఆధారాలు
గౌరవాన్ని పెంచే వేదాలు
తగ్గిపోతున్న తెలుగు వైభవాలు
దూరం అవుతున్న మాతృభాష కవులు
వాగన శాసనుడైన మన నన్నయ్య
జిగిబిగి శైలితో పెద్దన
భువన విజయంతో పోతన
శతకాలతో ప్రసిద్ధిచెందిన వేమన
ఇలా రచనలతో కురిపించారు శతకాలవాన
ఎండిపోతున్న రచనలతో రోధన
ప్రీతితో కలం పడితే పరిమళ రచనల కాన
తెలుగు గౌరవం పెంచాలని ఆవేదన
నేటితరం అలా కొనసాగాలని నా ప్రార్థన
Author
Items fine….
Telugu bhasha gupha thanam