తిరుగుబాటు – కవిత

నాడు…..

ఆంగ్ల పాలనలో, బానిస బ్రతుకు ఉచ్చులో 

నేడు…..

కక్ష-కుతంత్రాలు, దోపిడీ-అన్యాయాలు, 

హత్య-మానభంగాలు 

ధర్మశాస్త్రాలు మట్టిలో కలిశాయా?

చదువుకున్న విద్య చచ్చిపోయిందా?

ప్రేమానురాగాలలో చిక్కుకున్న 

హృదయాన్వేషణ అర్ధం కాదా?

ఓ తల్లిగా, ప్రేయసిగా, సోదరిగా, కూతురిగా 

బాధతో ఎంత కుమిలిపోవాలి?

సహించలేం……సహించి ఊరుకోలేం….

బాల్యవివాహాలు, 

శాశ్వతవైధవ్యం, సతీసహగమనంతో 

చేసిన పాపం సరిపోలేదా?

నరజాతి రక్తం ప్రవహించడంలేదా?

తరతరాలు మారినా మీ జాతి మారదు 

వేలెత్తి చూపినా భయం లేదు 

సంకెళ్ళేసినా సిగ్గు లేదు 

కన్నెత్తిచూస్తే బయపడాల్సిందే

సహించలేరు….సహించి ఊరుకోలేరు…

ఏం సాధించారు?

బాధతో స్త్రీ కన్నీటిని తప్ప

ఆ అర్ధాంతర చావుని తప్ప……