ఉగాది – కవిత

హేమలంబి వెళుతోంది విలంబి కి స్వాగతమిస్తూ

ఆంగ్ల సంవత్సరాది కాదు మనది ఇదే ఉగాది మిత్రులారా

ఆ అర్ధరాత్రి చేసేదీ పండుగేనా? తెల్లారి లేవడం బరువైపోయి

నేర్పిద్దాం మన భావితరానికి …

మన ఉగాది పచ్చడి ఏమిటో,

పంచాంగ శ్రవణమెందుకో

వసంత ఋతువు అంటే ఎంత హాయో

తీపి వగరులమేటి కలియక ఎంత రుచో

ఇది మనం మారువకుండా గురుతు చేసేందుకే అందమైన పండుగను మరింత రమ్యం చేస్తూ..

కోకిలలు కిలకిలా కూస్తుంటాయి

పచ్చని చెట్లు, మొక్కలు చిగురులు వేస్తాయి

చక్కని వెన్నెల చల్లగ వీస్తుంది

తెల్లని మల్లెలు గుబాలిస్తాయి

తీపిని పంచ చెరకు గెడలూ వస్తాయి

మామిడి పూతలు పిందెలు వేస్తాయి

ఉప్పూ, కొత్త చింతపండు వస్తాయి

వేప పూత మిరపకాయ తోడు వస్తాయి

ఆహా! ఈ రుచులూ, రంగుల మేలి కలయికల పండుగ సంబరం

ఉదయాన తలంటు తో మొదలై…

కొత్త బట్టలు, పిండి వంటలు రోజంతా హాయి,

కొత్త ప్రణాళికలు రాసుకుని ఆనందించ వోయి.

రండి! రారండి! మన ఉగాది జగత్తు కే ఉషస్సులు పంచే ఆనందాల పర్వదినం!

మమతలు పంచి, షడ్రుచుల ప్రేమను పంచి

ఏడాదంతా తీసుకోవలసిన జాగ్రత్తలు చూసుకుని

కార్యాచరణ కు శ్రీకారం చుట్టుకుని….

బంగారు రోజులు గడపడానికి బాటలు వేద్దాం..!

పిల్లా పాప కలిసి మెలిసి ఆడి పా డు దాం….

విలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తో…

బాలపద్మం

3 thoughts on “ఉగాది – కవిత”

Comments are closed.