ఉగాది శుభాకాంక్షలు – కవిత

శిశిరం లో రాలే ఆకులు లా

మీ కష్టాలను పారద్రోలండి

హేమంతపు చలి గాలులు లా

మీ ఆశయాలను సుస్థిరం చేయండి

శరత్ కాలపు వెన్నెల చల్లదనం లా

మీ మనసును హాయి తో నింపండి

వర్షాకాలపు మొక్కల పచ్చదనం లా

మీ విజ్ఞత-జ్ఞానాలకు పదును పెట్టండి

గ్రీష్మ ఋతువు లోని సూర్య తాపం లా

మీ అవమానాలు-నిరుత్సాహాలను కాల్చి వేయండి

వసంత ఋతువు లోని ప్రకృతి అందం లా

మీరు ఆనందం గా ఆహ్లాదం గా ఉండండి

ఆరు ఋతువులూ షడ్రుచుల ఆహారం లా

జీవితానికి అన్నీ అందిస్తాయి గా

అన్నిటికీ నిలబడి అన్నిటా ఓర్పుతో నేర్పుగా

ముందుకు సాగుతూ అభివృద్ధి పథం లో నిలవాలి

ఈ వికారి నామ ఉగాది మీకు ప్రతిదినం

ఆనందం నింపే పండుగ కావాలి

మీరంతా ఆయురారోగ్య భాగ్యాల తోడ నిలవాలి