వైకుంఠపాళి – కవిత

జీవితమనే వైకుంఠపాళిలో

బాల్యమనే తొలి మెట్టుపై,

అడుగు పెట్టినప్పుడు, పైకి

వెళ్ళమని ఎందరో ప్రోత్సహించారు.

ఆ ప్రోత్సాహముతో,

పైకి వెళ్ళే ధైర్యము వచ్చింది.

కౌమార్యంలో పాముల నోట్లో

పడకుండా మెలకువగా తప్పించుకునే నేర్పు

పాఠశాల నెర్పింది.

యవ్వనంలో నిచ్చెన జారకుండా

పట్టుతప్పకుండా,

పైకి అదుగులు వేసేలా,

జీవితమే నెర్పింది.

కానీ,

ఎలా జరిగిందో, ఎవరి పొరపాటో,

లేక నా గ్రహపాటో,

పై వరకూ వచ్చానని 

సంబరపడే సమయంలో,

పెద్ద పాము కొరలలో చిక్కి,

జర్రున జారి తిరిగి కిందకి చేరాను.

తర్వాత ఎంత ప్రయత్నించినా

పైకి ఎక్కలేకపొయాను.

చేయందించి సాయం చెసేవారు

ముందే పైకి చేరిపొయారు.

ఇక పైకి వెళ్లే తెగువ, ఓపిక,

సత్తువ లేక,

కిందే ఉండిపొయాను.