వ్యవసాయం – చిన్న వ్యాసం

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం తగ్గిపోతున్నది. ఎలా తగ్గిపోతున్నది అంటే పంటలు పండక, తగిన కాలంలో వానలు పడక సరిగా పంట దిగుబడి రాక చేసిన అప్పులు తీరక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థుతుల్లో బ్రతుకు దెరువు కోసం పట్టణాలకు వస్తున్నారు, ఇంకా కొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు అంతా పట్టణాలకు వచ్చేస్తున్నారు బతకడానికి. మనకు అన్నం పెడుతున్న రైతన్నలు కష్టాల్లో ఉన్నారు. విద్యార్థులారా చదువును కాదు మీరంతా చదవలిసింది ఒక్కసారి పల్లెలకు వెళ్లి వాళ్ళు పడుతున్న కష్టాలను చదవాలి. దయచేసి ఎందుకు చెబుతున్నానో ఒకసారి ఆలోచించండి. వ్యవసాయాన్ని కాపాడండి వ్యవసాయం మీద దృష్టిపెట్టండి. కాస్త ఉన్న సమయాన్ని వ్యవసాయం మీద దృష్టిపెట్టండి. రైతన్నలను మనమంతా ఆదుకుందాం రేపటి తరాల కోసమే నా ఆరాటం, నేటి విద్యార్థులు చదువు అయిపోయిన తరవాత ఉద్యోగాలకు బయటి ఊరుకు వెళతారు. ఇంకా ఉద్యోగాల విషయం లో పడి దాదాపు అందరిని మరచిపోతారు ఎవ్వరిని పట్టించుకోరు. ఉద్యోగమ్ దొరికాక ఆఫీస్ అంటూ బిజిగా ఉంటాము. ఎందుకు చెబుతున్నానో కాస్త అర్ధం చేసుకోండి. రాజకీయ నాయకులకు న విజ్ఞప్తి రైతన్నలు కష్టాల్లో ఉన్నారు దయచేసి వారిని ఆదుకోండి పదవులు తర్వాత ముందు ప్రజలు గుర్తుపెట్టుకోండి