ఏ కులం? ఏ మతం? – కవిత

ఏ కులం? ఏ మతం? - కవిత

కూడు నివ్వని కులాలు

గూడు నివ్వని మతాలు

నీడ నివ్వని బేధాలు

తోడురాని క్రోధాలు

వెంటాడే స్వార్థాలు

వేటాడే వ్యర్థాలు (మనుషులు)

మోసే భూమిది ఏ కులం? ఏ మతం?

దాహం తీర్చే నీటిది ఏ కులం? ఏ మతం?

పీల్చే గాలిది ఏ కులం? ఏ మతం?

కాల్చే నిప్పుది ఏ కులం? ఏ మతం?

గొడుగై దాచే నింగిది ఏ కులం? ఏ మతం?

పంచభూతాలకు లేని కులం, మతం నీకెక్కడిది

ఈ ప్రపంచాన్నే శాసించే పంచభూతాలకే తెలుస్తున్నాయి

కులం అంటే మానవత్వం అని

మతం అంటే మంచితనం అని

పంచేంద్రియాలతో శ్వాసించి, పంచభూతాలను

ఆస్వాదించే నీకు తెలియట్లేదా? వినపడట్లేదా?

12 thoughts on “ఏ కులం? ఏ మతం? – కవిత”

  1. Ee kavitha chadivi konthamandyna alichinchali,marali,apude mi kavithalaki oo ardam paramardam..

  2. Mee kavithalanni oka fresh feeling testay,manasuki hattukunela,alochinchela rayadam lo meeku meeresati. Meeku lerevaru poti.

Comments are closed.