యువత మేలుకో – కవిత

భావి భారత పౌరుడా…

నవ నైతికతా వీరుడా…

దేశ పరువు కాపాడరా…

పలు దేశాలకి ,సాటి నిలపరా…

అభివృద్ధి కి బాట వేయి ………..

ఙ్నాన సమరాన్ని జయించి….

యువత కి ఘనత పెంచు 

విఙ్నానాన్ని సంపాదించి…

మనిషి కి విలువ పెంచు 

నీ నడక తీరు మార్చి…..

మనలో మంచి పంచు…

నీ మనసు నే మంచిగ మలచి… .    

విజయాన్ని అనుసరించు ,

విమర్శలకై  వెను దిరగక.

ఓటమిని విమర్శించు ,

అపజయానికి తలవంచక.

భారతాభివృద్ధికి సాధనమై,

నిలుపు మన దేశ గౌరవమై…. …

భరతభవిత కి నిదర్శనమై ,…

నిలువు నిజ విజయ కేతనమై…….