గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

మధ్యాహ్న భోజనం బెల్ అయింది.
నేను ఇంటికి వచ్చిన.
ఆమె ‘వచ్చినవ? దా.. బువ్వ యేస్తా’ అన్నది.
ఒక ప్లేటులో అన్నం వేస్తున్నది.
నేను ఆమె వేస్తున్నప్పుడు చూస్తున్న.
ఆ ప్లేట్లో పిట్ట పియ్యి ఉన్నది.
దాని మీదనే అన్నం వేసింది. దాని పక్కన కూర వేసి నాకు ఇచ్చింది.
నాకు ఆ అన్నం తినబుద్ది కాలేదు.
కానీ చాలా ఆకలవుతుంది.
అన్నం పక్కకు జరిపి, ఆ పిట్ట పియ్యి తీసేసిన.
అదే అన్నం తిన్న.
రాసినవారు: గంగా
పార్ట్ – 1 పార్ట్ – 2 పార్ట్ – 3 పార్ట్ – 4 పార్ట్ – 5
పార్ట్ – 6 పార్ట్ – 7 పార్ట్ – 8 పార్ట్ – 9 పార్ట్ – 10
పార్ట్ – 11